విరాళాలకు తెలంగాణ ఎఫెక్ట్: కారు జోరు, సైకిల్ బేజారు!

2004 నుంచి తెలుగుదేశం పార్టీకి విరాళాలుగా రూ.53 కోట్లు వస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.10 కోట్లు వచ్చాయి. అయితే 2009-11 మధ్య మాత్రం తెరాస సంపాదించిన ఆదాయంలో 99.98 శాతం విరాళాలు ఉండగా.. టిడిపిది మాత్రం 54 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణవాదం బలంగా వీస్తున్న నేపథ్యంలో రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆదాయం భారీగా తగ్గగా టిఆర్ఎస్ ఆదాయం బాగా పెరిగింది.
2004తో పోలిస్తే ఎన్నికల సంవత్సరం 2009లో ఆ పార్టీ ఆదాయం పెరిగింది. కానీ, ఆ తర్వాత 2010-11లో 2004 కంటే పడిపోయింది. తెరాస ఆదాయం మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో తెరాస ఆదాయం రూ.కోటి మార్కు దాటగా, తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత భారీగా పెరిగింది. 2009-11 సంవత్సరాల్లో తెరాసకు రూ.3.17 కోట్లు ఆదాయం రాగా అందులో 99.98 శాతం విరాళాల రూపంలో వచ్చిందే.
టిడిపికి 2004-05 నుంచి 2010-11 వరకు వరుసగా రూ.7.42 కోట్లు, రూ.2.19 కోట్లు, రూ.8.92 కోట్లు, రూ.4.98 కోట్లు, రూ.12.30 కోట్లు, రూ.11.92 కోట్లు, రూ.6.15 కోట్లుగా ఉంది. వీటి మొత్తం రూ.53.90 కోట్లు వచ్చింది. స్వచ్ఛంద విరాళాలు, సభ్యత్వ నమోదు రుసుము, డిపాజిట్లపై వడ్డీల రూపంలో ఈ ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications