Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసీం త్రివేది అరెస్టు: రాజద్రోహం..రాజకీయ ద్రోహం..!

హైదరాబాద్: వెబ్‌లో జాతీయ చిహ్నాన్ని, దానిపై ఉన్న నినాదాన్ని అవమానపరుస్తూ కార్టూన్లు వేశాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టు అసీం త్రివేది అరెస్టయ్యారు. అయితే, ఈ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థితిలో తెలుగు కార్టూనిస్టుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అందులో భాగంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్టూనిస్టు శేఖర్ అభిప్రాయాన్ని సేకరించాం. ఆయన మాటల్లో ఆ అభిప్రాయాన్ని చదవండి....

Telugu Cartoonist Shekar on Aseem Trivedi issue

"కార్టూన్స్ వివాదాస్పదం అవడం, వాటి చుట్టూ రాజకీయాలు అల్లుకోవడం ఇటీవల పరిపాటి అయింది. పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్‌ కార్టూన్ చిత్రణ దగ్గరనుంచి ఇప్పటి అసీం త్రివేది రాజద్రోహ కార్టూన్ల వరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో భావాలు ఎంత సున్నితంగా ఉంటాయో బోదపడుతుంది. ముఖ్యంగా అధికారవర్గం తనకు నచ్చని పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని, దానికోసం పౌరులకు ఉన్న ఏ హక్కునైనా కాల రాస్తుందని మరోసారి రుజువైంది.

అంబేద్కర్‌ కార్టూన్‌లో ఒక వర్గం మనోభావాలు గాయపడితే, అసీం కార్టూన్లలో జాతి యావత్తు మనోభావాలు వ్యాకుల పడుతున్నాయి. యువకుల్లో ఉండే దుందుడుకు స్వభావం, సమాజ గమనాన్ని చూసి వచ్చే ఆవేశం అసీం త్రివేదిని ఆ కార్టూన్లను వేసేటట్లు చేశాయి.

అయితే కార్టూనిస్టులకు ఉండాల్సిన స్వయం నియంత్రణ కొరవడి ఈ పరిణామానికి దారి తీసింది. సోషల్‌ మీడయా, ఇంటర్‌నెట్‌ మీడయా పెరిగిన తర్వాత ఎవరిని ఎవరు కంట్రోల్‌ చేయగలిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవ అస్సాం జాతీయులను భయకంపితులను చేసినవి కూడా ఇలాంటివే. ఇవే కార్టూన్లు పత్రికల్లో అయితే సంపాదకుల ఆజమాయిషీ ఉండి ఉండేది. కాని సోషల్‌ మీడయ రీచ్‌ కూడా చాలా ఎక్కువ అవడంతో ఇట్లాంటి వాటి వల్ల జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోతోంది.

ప్రస్తుత కార్టూన్ల విషయానికి వస్తే అసీం త్రివేది కార్టూన్లు భావపరంగా ఉన్మాద స్థితిలో ఉన్న మాట వాస్తవం. పార్లమెంటును వేసిన తీరు దానికి పరాకాష్ట. వీటి వెనుక ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో ఇప్పుడప్పుడే స్పష్టపడుతోంది.అదే సమయంలో కార్టూనిస్టుగా బాధ్యత లేని తనం కనపడుతోంది. నేను గత సంవత్సరం ఫ్లోరిడాలో జరిగిన అమెరికన్‌ ఎడిటోరియల్‌ కార్టూనిస్టుల సదస్సు కి హాజరైనపుడు మలేషియన్‌ కార్టూనిస్టు జూనార్‌ని కలిశాను. ఆయన కూడా తన కార్టూన్లపై రాజద్రోహం కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆయనకి కరేజియస్‌ కార్టూనిస్టు అవార్డు ఇచ్చి సత్కరించారు అమెరికన్‌ కార్టూనిస్టులు. ఆయన వివాదాస్పద కార్టూనిస్టులను గమనించినపుడు కూడా చాలా బాధ్యతారాహిత్యం కనిపించింది.

ఇపుడు అసీం త్రివేదిని కూడా అమెరికన్‌ కార్టూనిస్టులు సన్మానించ పూనుకున్నారు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే కార్టూనిస్టులు సంయమనం కోల్పోకూడదని. ఇలా దేశాలో ఆందోళను కలిగించే వాటిని పాశ్చాత్యులు ప్రోత్సహిస్తుంటారన్న తెలివిడి కూడా అవసరం.

అదే సమయంలో అవకాశం దొరికింది కదాని ప్రభుత్వం రెచ్చిపోవడం, రాజద్రోహం లాంటి కేసు పెట్టండం, జైళ్లపాలు చేయడం ప్రజాస్వామ్యంలో సరైనవి కావు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో ఇలాంటి సమస్యని పరిష్కరించడానికి పూనుకోవాలి. అంతేగాని అన్నిటికి ఒకటే మంత్రం అన్నట్లు వ్యవహారించి హక్కును హననం చేయడం సరికాదు. అసీం త్రివేదిని ఈ విషయంలో హెచ్చరించవచ్చు. మరోసారి జరగకుండా సభ్య సమాజం ముందు అతన్ని నిలబెట్టవచ్చు. క్షమాపణ కోరవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వమైనా, మమతా బెనర్జీ ప్రభుత్వమైనా అధికార దండంతో సమస్యకు పరిష్కారం కనుగొనలేవు.

ముఖ్యంగా కళాకారులకు స్యయం నియంత్రణ పాటిస్తే మంచిది. అది మన బాధ్యత కూడా. అపుడే కళని కరెక్టుగా ఉపయోగించినట్లు. ఇదే అదునుగా మన రాజ్యాంగ హక్కులను హరించే అవకాశం తీసుకునే అధికార వర్గానికి అస్త్రాలు అందించకూడదు".

శేఖర్‌, కార్టూనిస్టు, ఆంద్రజ్యోతి దినపత్రిక

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+