పత్రికలోని కథనాలతో డూప్లికేట్ డైరీ: కెవిపిపై విహెచ్ ఫైర్

నాటి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలతో కెవిపి వైయస్ డైరీ సృష్టించారని ధ్వజమెత్తారు. ఆయన విషయంలో అధిష్టానం పునరాలోచించుకోవాలని హితవు పలికారు. డైరీ ఆవిష్కరణకు వెళ్లవద్దని తనతో పాటు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా చెప్పారని, అయినప్పటికీ ఢిల్లీ పెద్దలు వినలేదన్నారు. ఈ డైరీ డూప్లికేట్ అని, దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుందో పార్టీ పెద్దలు తెలుసుకోవాలని సూచించారు.
కెవిపి కాంగ్రెసులో ఉండి ప్రత్యర్థులకు అండగా నిలుస్తున్నారని, అధిష్టానం దీనిని గుర్తించాలన్నారు. కెవిపి చెప్పగానే వైయస్ కాంగ్రెసు ముఖ్యమంత్రి కాబట్టి వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పి నేతలు ఆవిష్కరణకు వెళ్లారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కెవిపిని విచారించాలని తాను సిబిఐ జెడి లక్ష్మీ నారాయణను కలుస్తానని చెప్పారు.
విహెచ్ తెలంగాణ విషయంపై కూడా మాట్లాడారు. తెలంగాణకు నక్సల్స్ సమస్యకు హోంమంత్రిత్వ శాఖ ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ సమస్య కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రలో కూడా ఉందన్నారు. కేంద్ర హోంశాఖకు ఏం సమాచారం ఉందో తనకైతే తెలియదన్నారు. చిన్న రాష్ట్రాలతో పాటు పెద్ద రాష్ట్రాల్లో కూడా నక్సల్స్ సమస్య ఉందన్నారు.












Click it and Unblock the Notifications