జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు: ఎంపి మేకపాటి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఉదయగిరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఆలోచన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.
తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖఱ రావు రెడీ అవుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీల కోసమే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయం అంతా కుటుంబ సంక్షేమం కోసమేనన్నారు.
వాయలార్ దగ్గరకు మిగతా నేతలను తీసుకెళ్లకుండా తన కుమారుడు కెడటి రామారావునే కేసీఆర్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకోవడమంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమేనని గోనె ప్రకాశరావు అన్నారు.












Click it and Unblock the Notifications