• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేం ఉండగా తెల్లవారుజాము వరకు: కిరణ్‌పై బాబు ఫైర్

By Srinivas
|

Chandrababu Naidu
హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా తాము తీసుకు వచ్చిన ఎస్సీ వర్గీకరణను కాంగ్రెసు ప్రభుత్వం నిలబెట్టలేక పోయిందని విమర్శించారు. కాంగ్రెసు బలహీనవర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఢిల్లీలో కూడా పోరాడుతామన్నారు.

రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం నెలకొందని, మమ్మల్ని కొట్టొద్దంటూ అధికారులు చేతులెత్తి మొక్కాల్సినంత దారుణంగా పరిస్థితి తయారైందని, కోతల వల్ల 40 లక్షల మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 7 లక్షల చిన్నతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పరిస్థితిని చక్కదిద్దే దిశగా చొరవ తీసుకోవట్లేదని విమర్శించారు. ఇది ఆయన బాధ్యతారాహిత్యమన్నారు.

శాసనసభ జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోందని, టిడిపి హయాంలో తెల్లవారుజామున 5 గంటల వరకు సభ నడిచిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత సభలో అసలు చర్చే జరగట్లేదని, ఇక సభ ఎందుకని, నాయకులకు గౌరవముంటుందా అని ప్రశ్నించారు. ప్రజలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేనితనం, చులకనభావం, ఏం చేయలేరన్న ధీమా ఉందని ఆగ్రహించారు. ప్రభుత్వ ఆస్తులు, సహజవనరులను ప్రభుత్వం ఇష్టారా జ్యంగా అమ్మేస్తోందని, ఇందుకు హక్కెవరు ఇచ్చారని బాబు ప్రశ్నించారు.

నవరత్న కంపెనీలను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న హర్తాళ్లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తాను ఢిల్లీలో వామపక్షాలతో కలిసి ఆందోళనల్లో పాల్గొంటానన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునే క్రమంలో కేంద్రం డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్ల కుదింపు వంటి చర్యలను చేపట్టిందని ధ్వజమెత్తారు. ఆరేళ్లలో 27 సార్లు పెట్రో ధరలు పెరిగాయని, 2004లో రూ.24.29గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు రూ. 51.17కు చేరుకుందని, అంటే 100 శాతం ధర పెరిగిందని వెల్లడించారు.

తాజా డీజిల్ ధర పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ. 4,285 కోట్ల అదనపు భారం పడిందన్నారు. ఇది కాక పెరగనున్న బస్సు చార్జీల కారణంగా మరో 400 కోట్లు, గ్యాస్‌పై 4 వేల కోట్ల మేరకు భారం పడనుందన్నారు. దేశంలో ఎక్కడ అవినీ తి జరిగినా, శాంతిభద్రతల సమస్య తలెత్తినా అందుకు మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని, స్కాం కాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారిపోయిందని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చొరవ చూపని సీఎం కిరణ్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu has blamed CM Kiran 
 
 Kumar Reddy for Assembly sesstioోns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X