వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌ను తీసేస్తారా నన్నుతొలగిస్తారా: డిఎల్, శంకరన్నా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy - Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పి.శంకర రావు గురువారం మరోసారి నిప్పులు చెరిగారు. డిఎల్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా కిరణ్‌ను మార్చాలని లేదా ఆయన మంత్రి వర్గం నుండి తనను తొలగించాలని తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లుగా చెప్పారు.

శంకర రావు కూడా తనదైన శైలిలో కిరణ్ పైన విరుచుకు పడ్డారు. కిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంక్ 33 శాతం నుండి 18కి పడిపోయిందని ఆరోపించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అలా అయితే పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు. నామినేటెడ్ పోస్టులో సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వారికి చాలారోజులుగా పార్టీలో అన్యాయం జరుగుతోందన్నారు.

గ్యాస్ పైన సబ్సిడీ భారం భరించలేమని ముఖ్యమంత్రి చెప్పడం అంతా గ్యాస్ మాటలే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ భారాన్ని భరించి తీరాలాన్నారు. సబ్సిడీ ఇచ్చే వారికి 9 నుండి 12 సిలిండర్లు పెంచాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోయిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభంజనంలోనూ రాష్ట్రంలో 33 శాతం ఉన్నకాంగ్రెసు ఓటు బ్యాంక్ కిరణ్ హయాంలో మాత్రం పడిపోతుందన్నారు.

ఒక ముఖ్యమంత్రి ఉండగా తాను మరో ముఖ్యమంత్రి గురించి మాట్లాడనని పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి వేరుగా ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కాంగ్రెసు మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడంలో దిట్ట అన్నారు. కేంద్రంలో ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. డిఎంకె, బిఎస్పీ, వామపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేవని, ఎఫ్‌డిఐలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదన్నారు.

English summary

 Minister DL Ravindra Reddy and former minister Shankar Rao are lashed out at CM Kiran Kumar Reddy again on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X