వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంకు సహకరిస్తే..: టి-మంత్రులకు హరీష్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గురువారం హెచ్చరించారు. హైదరాబాదులో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం సరికాదన్నారు. అడ్డుకోవాలని చూస్తే తాము ప్రత్యామ్నాయాలు చూసుకుంటామన్నారు. మార్చ్‌ను అడ్డుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రికి సహకరిస్తే జరిగే పరిణామాలకు తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలన్నారు.

సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. తెలంగాణవాదులను కవ్వించేందుకే ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. విగ్రహాలు పెట్టి చూస్తే అవి ఉంటాయో ఊడుతాయో తెలుస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అతను తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

అంతకుముందు పెట్రో ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలు ఉండవద్దని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనమండలి ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి వారిని పిలిపించి మాట్లాడినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం పోలీసు వాహనంలోనే తమ నిరసన తెలియజేశారు.

రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు తాము వాహనంలోనే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు తాము పోలీసు వాహనంలోనే వెళ్తామని చెప్పారు. విద్యుత్ కొరత కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 TRS MLA Harish Rao warned Telangana region ministers on Thursday that don't support CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X