వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్‌పై షిండేకు లగడపాటి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: మంత్రి శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన గురువారంనాడు షిండేకు ఓ లేఖ రాశారు. మంత్రి శ్రీధర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను ఆయన షిండే దృష్టికి తెచ్చారు.

శ్రీధరబాబును కోదండరామ్ బెదిరించారని, ఈ బెదిరింపులు రాజ్యాంగ వ్యతిరేకమని లగడపాటి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు, మావోయిస్టుల విధ్వంసం పెరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వలేమని వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయాలని, ఉద్యమ నేతలను అణచేయాలని ఆయన షిండేను కోరారు.

తండ్రికి పట్టిన గతే మంత్రి శ్రీధర్ బాబుకు పడుతుందని కోదండరామ్ కరీంనగర్‌లో అన్నట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేశారు. దీంతో కోదండరామ్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. కోదండరామ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా మండిపడ్డారు. దీనిపై లగడపాటి షిండేకు ఫిర్యాదు చేశారు.

తన వ్యాఖ్యలపై కోదండరామ్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తాను అన్న మాటలకు ముందు వెనకలు తీసేయడం వల్ల వేరే అర్థం వచ్చిందని, తమకు హింసపై నమ్మకం లేదని ఆయన అన్నారు. తాము గాంధేయ పద్ధతిలోనే ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన చెప్పారు.

English summary
Congress Seemandhra MP lagadapati rajagopal has made complaint against Telangana JAC chairman Kodandaram to union home minister Sushil kumar Shinde. He alleged that Kodandaram has threatened minister Sridhar babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X