వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం: నేతలకు మంత్రి శైలజానాథ్ ఫోన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత నేతలు అప్రమత్తమవుతున్నారు. కేంద్ర నిర్ణయానికి ముందే తమ వాణి వినిపించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ దీనిపై పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో ఫోన్ సంభాషణ సాగిస్తున్నారట.

ఈ నెల 22తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. దీనికి ముందే, అంటే 21న సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమావేశమైతే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవైపు తెలంగాణ ప్రాంత నేతలు తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారని, ఈ సమయంలో తమ గళం వినిపించకపోతే కేంద్ర నిర్ణయం ఏకపక్షమయ్యే అవకాశం ఉండవచ్చునని వారిలో కొందరు ఆందోళన చెందుతున్నారట.

అందుకే ఒకచోట చేరి ఈ అంశంపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ సదరు నేతలకు చెబుతున్నట్లు సమాచారం. అంతా అంగీకరిస్తే కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉండి కాంగ్రెసు పెద్దలతో తెలంగాణపై మంతనాలు జరుపుతున్నారు.

English summary
Seemandhra leaders are planning to meet about 
 
 Telangana issue before 22nd of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X