యుపిఎకు నమ్మకమైన భాగస్వామి సిబిఐ: వెంకయ్య

సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపిందని ఆయన మండిపడ్డారు. గత ఏనిమిదేళ్ళుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంస్కరణల ఊసేత్తలేదని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో మూడో వంతు సభ్యులు ఎఫ్‌డిఐలకు తాము వ్యతిరేకమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళను ఉధ్యతం చేస్తామని వెంకయ్య నాయుడు కేంద్రాన్ని హెచ్చరించారు.
కేంద్రంలో మూడో ఫ్రంట్ వస్తుందన్న దానిపై వెంకయ్యనాయుడు స్పందించారు. మూడో ఫ్రంట్ ఎండమావిలాంటిదని, అందులో కలిసిన పార్టీల్లో ఐక్యత లేదని ఆయన ఆరోపించారు. యుపిఎకు మద్దతిస్తూ మూడో కూటమి ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన అడిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్త్రాత్రేయతోపాటు పెనవాజ్ హుస్సేన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా బయలుదేరిన వెంకయ్యనాయుడు, షానవాజ్, కిషన్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications