హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారుల వల్లే: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttam Kumar Reddy
హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల హౌసింగ్ కార్పోరేషన్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల వైఖరిని తప్పు పట్టారు. అధికారుల అవినీతి కారణంగానే హౌసింగ్ శాఖకు చెడ్డపేరు వస్తుందని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

లబ్ధిదారుల దగ్గర అవినీతకి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు లబ్ధిదారులకు అందాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించాలని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు సూచించారు. అవినీతికి పాల్పడిన అధికారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, డిస్మిస్ చేస్తామని అన్నారు.

హౌసింగ్ కార్పోరేషన్ పరిధిలో 40 ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 10 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రతిపాదన ఉందని చెప్పారు. గతంలో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని సూచించారు. కాగా గతంలోనూ పలువురు మంత్రులు ఆయా శాఖల అధికారుల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.

కాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.1 మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేరుగా చెప్పారు. అభివృద్ధి నిధులను రూ.2 కోట్లకు పెంచే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఈ నిధులు రూ.3 కోట్లకు పెంచాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

English summary
Minister Uttam Kumar Reddy make controversial comments on housing corporation officers on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X