అక్కడంత సీన్ లేదు: తెలంగాణపై చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ శాసనసభ్యులకు వివరించారు. ఢిల్లీ పర్యటన తరువాత చంద్రబాబుఅసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌లో వారితో శుక్రవారం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న హడావుడి గురించి ఎమ్మెల్యేలు సందేహాలు వ్యక్తం చేయగా, ఇక్కడ హడావుడి ఉంది కానీ ఢిల్లీలో అలాంటిదేమీ లేదని అన్నారు.

మభ్యపుచ్చడానికి కాంగ్రెస్ ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నట్టు నటిస్తోంది గానీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదని చంద్రబాబు శాసనసభ్యులకు తెలిపారు. కెసిఆర్‌తో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో చర్చలు, గవర్నర్ ఢిల్లీ పర్యటన వంటివి చూస్తుంటే ఈసారి తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాత్రం అలాంటి సూచనలు ఏమీ ఢిల్లీలో కనిపించలేదని అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ నాయకులతో చర్చిస్తుంది కానీ కెసిఆర్‌తో ఎందుకు మాట్లాడుతుంది, కెసిఆర్‌ను పిలిచారంటేనే తెలంగాణ ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని అర్థం అని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మమతాబెనర్జీ మద్దతు ఉపసంహరించుకున్నా, మరో 30-40 మంది ఎంపిలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ రాజకీయ పార్టీ కూడా మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా లేదు కాబట్టి ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చంద్రబాబు తెలిపారు. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీ,పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు వస్తే పార్టీ నష్టపోతుందని, గత అనుభవాల దృష్ట్యా విడివిడిగాఎన్నికలు వస్తే బాగుండేది అని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు అసెంబ్లీకి విడిగా ఎన్నికలు వస్తాయని, దీని వల్ల పార్టీకి ప్రయోజనం అని ఎమ్మెల్యేలు తెలిపారు. మూడో ఫ్రంట్‌కు అవకాశాలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటేకేంద్రంలో మూడవ ఫ్రంట్‌కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్బలహీనపడుతోంది, బిజెపి ఎదగడం లేదు, దీంతో మూడవ ఫ్రంట్‌కే ఎక్కువ అవకాశాలుకనిపిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.

ఒకవైపు కేంద్రం తెలంగాణ ఇచ్చే అవకాశం లేదనిచంద్రబాబు చెబుతూనే మరోవైపు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని నిర్ణయించుకోవడంవిడ్డూరంగా ఉందని సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లేఖఇవ్వడానికి బాబు సన్నద్ధం అయ్యారు, ఒకవైపు తెలంగాణ రాదని చెబుతూ మరోవైపు లేఖ అవసరం ఏమిటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+