బాపూజీకి తుది వీడ్కోలు, చితికి నిప్పు పెట్టిన కూతురు

Konda Laxman Bapuji
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. పద్మశాలీ భవన్ ‌నుంచి ఆయన పార్థివదేహాన్ని గాంధీభవన్ తరలించారు. అక్కడ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఆయనకు ఇష్టమైన జలదృశ్యం వరకు అంతిమ యాత్ర సాగింది. కళాకారులు తమ గీతాలతో నివాళులు అర్పించారు. కూతురు పవిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ చితికి నిప్పంటించారు.

హైదరాబాదులోని జలదృశ్యంలోనే జరుగుతాయని అంతకు ముందు కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. ప్రభుత్వ అధికార లాంఛనాలన్నీ పద్మశాలి భవన్‌లో జరుగుతాయని, అంత్యక్రియలు జలదృశ్యంలో జరుగుతాయని కేశవ రావు చెప్పారు. పద్మశాలి భవన్ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభమై గాంధీ భవన్‌కు చేరుకుంది. కొండా లక్ష్మణ్ బాపుజీ భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ రావాలని కోరుకున్నారని, బాపూజీ కలల సాకారం కావాల్సిన అవసరం ఉందని జైపాల్ రెడ్డి అన్నారు.

అయితే, అంత్యక్రియలు జలదృశ్యంలోనే జరపాలని డిమాండ్ చేస్తూ మొదట జైపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

జలదృశ్యం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీకి అత్యంత ప్రియమైంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం కోసం ఆయన దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+