జలదృశ్యంలోనే బాపూజీ అంత్యక్రియలు: జైపాల్ నివాళి

ప్రభుత్వ అధికార లాంఛనాలన్నీ పద్మశాలి భవన్‌లో జరుగుతాయని, అంత్యక్రియలు జలదృశ్యంలో జరుగుతాయని కేశవ రావు చెప్పారు. పద్మశాలి భవన్ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కొండా లక్ష్మణ్ బాపుజీ భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ రావాలని కోరుకున్నారని, బాపూజీ కలల సాకారం కావాల్సిన అవసరం ఉందని జైపాల్ రెడ్డి అన్నారు.
అయితే, అంత్యక్రియలు జలదృశ్యంలోనే జరపాలని డిమాండ్ చేస్తూ మొదట జైపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
జలదృశ్యం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీకి అత్యంత ప్రియమైంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం కోసం ఆయన దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications