హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు రోజుల్లో తేలుస్తా: తెలంగాణపై చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్టీ తెలంగాణ నేతలు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన సోమవారం ఆ విషయం చెప్పారు. తెలంగాణపై రేపు, ఎల్లుండి చర్చలు జరుపుతానని, రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని ఆయన అన్నారు. పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో తెలంగాణ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడంపై పార్టీ తెలంగాణ నేతలు కినుక వహించినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, తెలంగాణపై స్పష్టత ఇస్తానంటూ చంద్రబాబు చాలా రోజులుగా చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటివారంలోనే తెలంగాణపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే, సీమాంధ్ర నాయకుల నుంచి కొంత మేరకు వ్యతిరేకత ఎదురు కావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం టి-టిడిపి నేతలు పలువురు వేరుగా సమావేశమయ్యారు. సమావేశంలో చంద్రబాబు కేంద్రానికి రాయాల్సిన లేఖ పైన, తెలంగాణ పైన మాట్లాడక పోవడంతో ఆయన ఈ విషయంపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి టిటిడిపి నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు ప్రత్యేకంగా సమావేశమై బాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెల 30వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత ఇచ్చినా లాభం ఉండదని బాబుకు చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వారం రోజుల్లోనే తెలంగాణపై బహిరంగ ప్రకటన, కేంద్రానికి టిడిపి తరఫున లేఖ పంపించే విషయాలపై చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఒప్పించాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పటికీ బాబు స్పందించని పక్షంలో, ఒకవేళ స్పందించినా ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu said that he will give clarity on Telangana issue within two days. He said that he will discuss on Telangana for two days starting tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X