హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్నెల్లముందే: తెలంగాణపై టిజి, ప్రకటనేరాదు: కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - TG Venkatesh
హైదరాబాద్/న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణపై కేంద్రం నిర్ణయం వెలువర్చే అవకాశముందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ సోమవారం అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులం అందరం న్యూఢిల్లీ వెళతామని చెప్పారు. తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాన్ని ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంచాలని అధిష్టానాన్ని, కేంద్రాన్ని కోరతామని చెప్పారు.

2014లోగా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద నీరు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు సీమాంధ్రలోనూ ఉన్నాయన్నారు. వెనుకబడిన అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని కోరుతామన్నారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఢిల్లీలో తెలంగాణ కోసం యత్నిస్తున్నారన్నారు. అందుకే సీమాంధ్రలో అలజడి ప్రారంభమైందని చెప్పారు. సీమాంధ్రలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి తమ వాణిని వినిపిస్తామన్నారు.

మరోవైపు ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నేతలు ఎంపి కావూరి సాంబశివ రావు ఇంట్లో భేటీ అయ్యారు. మంత్రి శైలజానాథ్, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డి, జెడి శీలం తదితరులు భేటీ అయ్యారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఈ నెలలోనే నిర్ణయం వస్తుందన్న ప్రచారాన్ని తాము నమ్మడం లేదని అన్నారు. తాము ప్రకటన తమకు వ్యతిరేకంగా వస్తుందని భావించడం లేదన్నారు. నిర్ణయం ఇప్పుడప్పుడే కాదని చెప్పారు. తెలంగాణపై ఢిల్లీలో రాష్ట్రంలో అనుకున్నంత హడావుడి ఏమీ జరగడం లేదన్నారు.

30వ తారీఖు తర్వాత సీమాంధ్ర నేతలం మళ్లీ భేటీ అయి మరోసారి చర్చిస్తామని చెప్పారు. 30వ తేది లోపు తెలంగాణపై ప్రకటన వచ్చే అవకాశమే లేదన్నారు. తెలంగాణపై అసలు ప్రకటనే రాదని, కెసిఆర్ ఢిల్లీలో ఉండటం వల్ల తమకేమీ ఆందోళన లేదని కావూరి సాంబశివ రావు అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ విమర్శలపై తాను బహిరంగంగా మాట్లాడనని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వేరుగా అన్నారు. వేరే పార్టీ నేతలు మాట్లాడితే బహిరంగంగా స్పందిస్తానన్నారు. తమ పార్టీ నేతలు ఎవరైనా విమర్శిస్తే పార్టీ వేదిక పైనే మాట్లాడుతానన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రమంత్రులు చెప్పారని లగడపాటి తెలిపారు.

ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం ఏర్పడిందని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ తన సూచనలను ఎవరూ పాటించడం లేదన్నారు. తెలంగాణణ ప్రకటన అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశం అనంతరమే కేంద్ర నిర్ణయం ఉంటుందని డిఎల్ స్పష్టం చేశారు.

English summary
Minister TG Venkatesh said on Monday that Central Government may take decision on Telangana issue before 2014 general elections. Vijayawada MP Lagadapati Rajagopal did not like to respond on Madhu Yashki comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X