సిడబ్ల్యుసిలో నో 'తెలంగాణ': తేలిగ్గా తీసుకుంటోందా?

ప్రధాని సంస్కరణలను సమర్థిస్తున్నామని, అయితే దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వెంటనే గాఢిలో పెట్టాలని సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని తెలిపారు. దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందని ద్వివేది అభిప్రాయపడ్డారు. తెలంగాణపై భేటీలో ఏమైనా చర్చించారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. ప్రత్యేకంగా ఏ రాష్ట్రం గురించి చర్చించలేదని, అలాగే తెలంగాణ పైనా చర్చించలేదన్నారు. అసోంలో జరిగిన మత ఘర్షణలు, దేశ రాజకీయ పరిస్థితులు, మమతా బెనర్జీ అంశం తదితరాలపై భేటీలో మాట్లాడారు.
ఈ భేటీకి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో సహా ముగ్గురు ఢిల్లీలో లేనందున రాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హాజరయ్యారు. సోనియా గాంధీ భేటీలో ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. దేశ పరిస్థితులను చక్కదిద్దాలని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోనియా భేటీలో అభిప్రాయపడ్డారు. కేంద్రానికి మమత మద్దతు ఉపసంహరణపై అధినేత్రి వివరణ ఇచ్చారు. మతఘర్షణలను సిడబ్ల్యుసి ఖండించింది. అయితే త్వరగా అసోంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంపై ఆనందం వ్యక్తం చేశారు.
అసోం అవాంఛనీయ సంఘటనలపై పరిస్థితిని చక్కదిద్దడానికి సహకరించిన వారికి వీరు కృతజ్ఞతలు తెలిపారు. అసోం ఘటనపై చిదంబరం భేటీలో వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి మనం బయటపడ్డామని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం అవసరమని భావిస్తున్నామని, సబ్సిడీని అదుపు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను భేటీ ఆహ్వానించినట్లు ద్వివేదీ చెప్పారు.
అయితే ఈ భేటీలో ఎఫ్‌డిఐ, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తదితరాలతో పాటు తెలంగాణ అంశం కూడా చర్చకు వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ భేటీలో తెలంగాణపై ఎలాంటి చర్చ జరగక పోవడం గమనార్హం. సిడబ్ల్యుసి భేటీలో ఈ అంశంపై చర్చ జరగక పోవడాన్ని చూస్తుంటే.. ఈ అంశాన్ని కాంగ్రెసు పార్టీ తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications