వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తేల్చిన చంద్రబాబు, ప్రధానికి లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్ర విరగకుండా, పాము చావకుండా తేల్చేశారు. తక్షణమే తెలంగాణ అంశాన్ని తేల్చాలని కోరుతూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశంలో తమ వైఖరిని స్పష్టం చేస్తామని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయాన్ని ఆయన తేల్చలేదు.

తాము 2008 అక్టోబర్‌లో తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను తాము వెనక్కి తీసుకోలేదని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, వెంటనే అనిశ్చితికి తెర దించాలని ఆయన ప్రధానిని కోరారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిందని ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై 2004లో కాంగ్రెసు హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని గెలిచిందని, ప్రజలను కాంగ్రెసు మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ స్వార్ధం కోసం వాడుకుంటోందని, కాంగ్రెసు రాజకీయం కోసం వాడుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం జఠిలం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. తమ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. 2008లో లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారే తప్ప ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పలేదు.

చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖను గొప్ప ముందడుగుగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు అన్నారు. కాంగ్రెసు, తెరాస తమ పార్టీని దెబ్బ తీయడానికి తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నాయని, ఆ పార్టీల నాయకుల నాటకాలు దీంతో బయటపడుతాయని వారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు లేఖను ఆహ్వానించారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు మంగళ, బుధవారాలు తెలంగాణ, సీమాంధ్ర నాయకుల ఉమ్మడి సమావేశంలో చర్చించారు. చివరకు బుధవారం రాత్రి చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.

తెలంగాణపై తీర్మానం పెట్టాలని గానీ, తాము తెలంగాణకు అనుకూలమని గానీ చంద్రబాబు ప్రధానికి లేఖలో చెప్పలేదు. తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖను మాత్రమే ప్రస్తావించారు. అయితే, తెలంగాణవాద పార్టీలు మాత్రం చంద్రబాబు లేఖలోని అంశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాదయాత్ర కోసం మాత్రమే చంద్రబాబు ఆ లేఖ రాశారని వారంటున్నారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెడితే తాము ఓటేస్తామని చెప్పలేదని, తాము తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరలేదని వారంటున్నారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu has written a letter PM Manmohan singh to resolve Telangana issue as early as possible. He demanded convene all party meet on Telangana issue. He said that his party stand will be delivered in all party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X