మార్చ్ వాయిదా వేయించే యత్నం: సిఎం ఫోన్‌పై కెకె

నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి సహా పలువురు విజ్ఞప్తి చేశారు. అయితే జెఏసి మాత్రం ససేమీరా అన్నది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం వారితో అనధికారికంగా చర్చించి వాయిదా వేయించేందుకు ప్రయత్నించనుంది. ఇవాళో లేదా రేపో చర్చలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
జెఏసితో చర్చించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం కలిపి రంగంలోకి దింపిందట. వీరు జెఏసితో చర్చించి మార్చ్‌ను నెల రోజులు వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తారట. జీవ వైవిధ్య సదస్సు 19 రోజులు ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 20వ తేది తర్వాతకు మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని వీరు జెఏసిని కోరనున్నారట.
కృష్ణా జిల్లాలోని ఇందిర బాట కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ విషయమై ప్రతినిధులతో ఫోన్ ద్వారా చర్చించారని సమాచారం. మంత్రి జానా రెడ్డి, కె.కేశవ రావు హైదరాబాదులో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ మార్చ్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సందేశం ఇవ్వనున్నారు. ఈ ఆడియో ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది.
మార్చ్ జరిగి తీరుతుంది.. కెకె
మార్చ్ వాయిదా వేయించేందుకు ప్రభుత్వం జానా, కెక, దామోదరలతో జెఏసితో మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో కెకె స్పందించారు. తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారేమోనని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు. మార్చ్ ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుందన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం వహించే అవకాశం లేదని, తనపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, మంత్రులతో కలిసి మార్చ్‌కు అనుమతి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications