k chandrasekhar rao kodandaram telangana march hyderabad కె చంద్రశేఖర రావు కోదండరామ్ తెలంగాణ మార్చ్ హైదరాబాద్
అనుమతివ్వాలి: కెసిఆర్, మార్చ్ చేస్తాం: కోదండరామ్

తెలంగాణ మార్చ్ జరిగి తీరుతుందని తెలంగాణ జెఎసి కోదండరామ్ అన్నారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేసే దిశలో తమ ఉద్యమం ఉంటుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహిస్తామని ఆనయ అన్నారు. వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగించబోమని ఆయన అన్నారు.
తాము శాంతియాత్ర చేస్తామంటే ప్రభుత్వం పోలీసు కవాతు చేస్తానని అంటోందని కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం ఓ వైపు చర్చలకు ఆహ్వానిస్తూ మరో వైపు అరెస్టులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రుల పాత్ర కీలకం కానుందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ మంత్రులు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి లేదా మార్చ్‌కు అనుమతి ఇప్పించాలని ఆయన అన్నారు. జై గణేశా, జై తెలంగాణ నినాదంతో నాటి జాతీయోద్యమ స్ఫూర్తితో మార్చ్‌లో ముందుకు సాగాలని తాము తెలంగాణవాదులకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మంత్రులు జోక్యం చేసుకోకపోతే ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు గుప్పెడు మంది సీమాంధ్రుల చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వడానికి డిజిపి నిరాకరించారని, అయినా వెనక్కి తగ్గబోమని స్వామి గౌడ్ అన్నారు. అరెస్టులకు భయపడబోమని ఆయన అన్నారు.