హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మశానంలో పడుకొని..: భూమన వినూత్న నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
తిరుపతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశాన స్థలం కోసం వినూత్నంగా నిరసన తెలిపారు. తిరుపతిలోని పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన స్మశానం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 60వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. దీంతో రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని స్మశానం కోసం కేటాయించాలని ప్రజలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వసతులు లేని, సరిగా స్థలం లేకుండా ఉన్న స్మశానంలో మంగళవారం రాత్రి శ్మశాన నిద్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలపై స్పందించి వెంటనే స్మశానం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని భూమన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఓ వైపు చితిమంటలు, మరోవైపు దుర్గంధం మధ్యనే భూమన కాసేపు పడుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

పెంచిన ఆర్టీసి ఛార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం తెలిపారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజల పక్షాణ నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసినట్లు ఆమె తెలిపారు.

చెన్నకేశవ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డిలకు విజయమ్మ పరామర్శ

గుండె సంబంధిత సమస్యతో వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డిలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. ఆమె వెంట ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
Tirupati of Chittoor MLA Bhumana Karunakar Reddy protested differently for cemetry on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X