ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫర్, కరుణానిధి రిజెక్ట్

Karunanidhi
చెన్నై: మంత్రి పదవులు తీసుకోవాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన సూచనను డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తిరస్కరించారు. యుపిఎ కీలక భాగస్వామి అయిన డిఎంకెకు రెండు క్యాబినెట్ మంత్రి పదవులు లేదా కొన్ని సహాయ మంత్రి పదవులు ఇవ్వడానికి ప్రధాని ముందుకు వచ్చారు.

కరుణానిధితో చర్చించడానికి మంగళవారం పిఎంఓలో సహాయ మంత్రి వి. నారాయణ స్వామిని పంపించారు. మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన ద్వారా ప్రధాని చెప్పించారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరడానికి తాను పార్టీ ప్రతినిధులు ఎవరినీ ప్రస్తుతం సిఫార్సు చేయబోనని కరుణానిధి నారాయణ స్వామికి చెప్పారు.

కరుణానిధిని నారాయణస్వామి మంగళవారం కలిసి అర గంట పాటు చర్చించి, ప్రధాని ఆఫర్ గురించి వివరించారు. 19 మంది సభ్యులు గల తృణమూల్ కాంగ్రెసు యుపిఎ నుంచి వైదొలిగిన తర్వాత 18 మంది సభ్యుల గల డిఎంకె అత్యంత పెద్ద మిత్రపక్షంగా మారింది.

తమ పార్టీ పార్లమెంటు సభ్యులు మంత్రి పదవులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కరుణానిధి ఆలోచన మరో విధంగా ఉందని డిఎంకె వర్గాలంటున్నాయి. ప్రభుత్వ స్థిరత్వం గురించి కరుణానిధి ఆలోచిస్తున్నట్లున్నారని ఆ వర్గాలన్నాయి. యుపిఎతో కొనసాగడాన్ని జిల్లా కార్యదర్శులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవాలని వారు కోరుతున్నారు.

యుపిఎపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, అయినా యుపిఎ ప్రభుత్వాన్ని బలపరచడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని, అదే సమయంలో కాంగ్రెసుకు దూరంగా ఉంటున్నామని డిఎంకె సీనియర్ నేతలు అంటున్నారు. ఇదే వ్యూహాన్ని అనుసరించేందుకు కరుణానిధి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందుకే మంత్రివర్గంలో చేరడానికి ఆయన విముఖత ప్రదర్శించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+