వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబై యువతే ఆశలు పెంచుతోంది: ఒబామా

రాజకీయ నాయకుల చర్యలు తనలో ఆశను పెంచడం లేదని, తాను చూసిన ప్రజలే ఆశలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచానికి ఆవలి సగం కొత్తవాళ్ల కోసం అమెరికా సైనికులు తమ జీవితాలను ఫణంగా పెట్టి వికలాంగులు అవుతున్నారని ఆయన అన్నారు.
జకార్తా, సియోల్‌ల్లోని విద్యార్థులు తమ విజ్ఞానాన్ని మానవాళికి వాడాలని చూస్తున్నారని, ముంబై విద్యాసంస్థల్లోని యువత హామీ ఇస్తోందని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తమను విభజించే అంశాలు వార్తలుగా మారుతున్నాయని, వాటిపై రాజకీయ చర్చలు సాగుతున్నాయని, దాన్ని పక్కన పెట్టి చూస్తే స్వేచ్ఛాజీవనం సాగించాలనే కోరిక, శ్రమశక్తి సౌందర్యాన్ని గౌరవించే తీరు కనిపిస్తుందని, ప్రజలకు ప్రభుత్వాలు సేవ చేసినప్పుడే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.