ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల; మార్చ్‌పై టి.మంత్రుల సలహా

కాగా మార్చ్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో న్యాయవాదులు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సూర్యాపేటలో వందమంది తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు. అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తదితర పట్టణాలలో ముందస్తు అరెస్టులు చేశారు.
వరంగల్ జిల్లా హన్మకొండలో న్యూడెమోక్రసీ సభకు అనుమతి లేదని నేతలను అరెస్టు చేశారు. తెలంగాణవ్యాప్తంగా పది జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టులపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అరెస్టులు అప్రజాస్వామికమని, ప్రభుత్వం హింసను రెచ్చగొడుతుందని పివోడబ్ల్యు సంధ్య ఆరోపించారు. లాయర్లపై కక్ష సాధింపు చర్యలు సహించేది లేదని, మిలియన్ మార్చ్ కేసులు మళ్లీ ఓపెన్ చేయడం కుట్ర అని లాయర్ల జెఏసి ఆరోపించింది. జనగామలో తెలంగాణవాదుల కవాతును పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని కోరుతూ బిజెపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిజిపి దినేష్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. వారితో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత తెలంగాణ మార్చ్ పైన నిర్ణయాన్ని తెలుపుతామని మంత్రి జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఏసి, ప్రజాసంఘాలు తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని తమను కోరాయన్నారు.
సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తున్నారని, ఆయనను కలిసిన తర్వాత నిర్ణయాన్ని చెబుతామన్నారు. వినాయక నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో మార్చ్ పైన ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలకు గడువు కావాల్సి ఉంటుందన్నారు. సిఎంతో చర్చలు జరిపి శుక్రవారం లోగా మార్చ్ పైన నిర్ణయాన్ని చెబుతామన్నారు. కాగా మార్చ్‌కు అనుమతిచ్చి నిబంధనలు కఠినతరం చేయాలని ముఖ్యమంత్రికి తెలంగాణ మంత్రులు సూచించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications