ముట్టడికి ఆటంకం, మళ్లీ అట్టుడుకుతున్న ఒయు

ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం తీరు వల్లనే హింస జరుగుతోందని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. తీరు మార్చుకోకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.
తెలంగాణ మార్చ్‌ను ముందుండి నడిపించాల్సిన రాజకీయ నాయకులు పారిపోయారని తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అన్నారు. మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌దని ఆయన అన్నారు.
ఒయులోని ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థుల ర్యాలీ ప్రారంభమైంది. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. విశ్వవిద్యాలయం ఆవరణలోకి పోలీసులు ప్రవేశించకూడదని విసి సర్క్యులర్ జారీ చేశారు. దీంతో గేట్లు మూసేసి విశ్వవిద్యాలం వెలుపల పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు.












Click it and Unblock the Notifications