కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకు ఆర్నెల్ల ముందు తెలంగాణ: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై రాబోయే శాసనసభ ఎన్నికలకు ఆరు నెలలు ముందు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాయలసీమకు చెందిన చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. శుక్రవారం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణ సమస్య సున్నితమైనదన్నారు. ఇప్పటికే బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణకు అనుకూలమంటూ పొందుపరచడం జరిగిందన్నారు. గతంలో ప్రజారాజ్యంపార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉండేదన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో ఇక చేసేదేమీ లేదన్నారు.

అయితే చివరకు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అంతవరకు ఉద్యమాలు చేపట్టినా, మార్చ్‌లు నిర్వహించినా ప్రయోజనం ఉండదన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమ రాయలసీమ పరిస్థితి ఏమిటంటూ ఆయన గత కొలంగా అడుగుతున్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

English summary
Minister belongs to Rayalaseema region TG Venkatesh said that decision on Telangana will be delivered before the election. He said that Congress high command decision will be accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X