18 ఏళ్లు బహిష్కరించాలి: బొత్సపై సమైక్యాధ్ర జెఏసి ఫైర్

పద్దెనిమిదేళ్ల పాటు బొత్స, ఆయన కుటుంబ సభ్యులను బహిష్కరించాలని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ కవాతు నేపథ్యంలో సీమాంధ్రవాసులకు గానీ, నేతలకు గానీ, వారి ఆస్తులకు గానీ నష్టం వాటిల్లితే తాము ఇచ్చే రేపటి బందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని మంత్రి శైలజానాథ్ చెప్పారు. సీమాంధ్ర నేతలు హైదరాబాదులో కవాతు నిర్వహిస్తే మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు, ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం హైదరాబాదులో వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జైఆంధ్రా కవాతు ప్రారంభమైంది. విజయవాడ బిజెపి కార్యాలయం నుండి జై ఆంధ్రా కవాతును నిర్వహించారు. కాగా జై ఆంధ్రా మార్చ్ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications