బాబు బ్రాండ్అంబాసిడర్, సినిమా తీసేందుకా: శోభా రెడ్డి

Shobha Nagi Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శోభ నాగి రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం నుండి చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పెట్టారని, ఆ పేరును చూస్తుంటే ప్రజలను బెదిరించేలా ఉందని ఎద్దేవా చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని చూస్తే ప్రజలకు వర్షాలు గుర్తుకు వచ్చేవన్నారు.

అదే చంద్రబాబును చూస్తే కరవు గుర్తుకు వస్తుందన్నారు. కరవుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రజల మనసుల్లో నిలిచి పోయారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఓ కాలం చెల్లిన వస్తువు అని, ప్రజలు దానిని ఎప్పుడో తిరస్కరించారని అన్నారు. బాబు చేసేది పాదయాత్రలా లేదని శవ యాత్రలా ఉందన్నారు. బాబు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

శుభప్రదంగా చేయాల్సిన యాత్రను బాబు క్షుద్ర పూజలతో చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. పాదయాత్రకు సినిమా దర్శకుల సలహాలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారి సలహాలు తీసుకోవాల్సిన అఘాయిత్యం ఎందుకు వచ్చిందన్నారు. దర్శకుల సూచనలు పాదయాత్రకు అవసరమా అని కూడా బాబు ఆలోచించాలన్నారు. ఆయన పాదయాత్ర చేపట్టేది ప్రజల కష్టాలు తెలుసుకోవడానికా లేక సినిమాలు తీయడానికా చెప్పాలన్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణ అంటే చంద్రబాబుకు ఎందుకు అంతగా భయం అని వారు ప్రశ్నించారు. సిబిఐ విచారణ అనగానే ఆయన కోర్టు గుమ్మం ఎక్కి స్టే తెచ్చుకుంటారని విమర్శించారు. కాగా మంగళవారం నుండి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+