లగడపాటి గురించి మాట్లాడటం మానేశా: కోదండరామ్

ఎవరి పద్ధతిలో వారు తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని వేర్వేరుగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో రాజకీయ ప్రక్రియ ఉండరాదంటే నిర్ణయం రాదన్నారు. ఓ వైపు ఢిల్లీలో చర్చలు జరుపుతూనే మరోవైపు గల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తామని కోదండరామ్ చెప్పారు.
మీ ముగ్గురికే దురద ఎందుకు.. టి.ఎంపీలు
సీమాంధ్ర ప్రజలకు లేని దురద మీ ముగ్గురికే ఎందుకని లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావులను తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం తదితరులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఏలూరులో పెట్టిన సమావేశంతో తేలి పోయిందని వారు ఎద్దేవా చేశారు.
తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ కోసం ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. కవాతుతో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేశారని లగడపాటి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తలకాయ ఉన్నవాడెవడూ అలా వ్యాఖ్యానించరని, లగడపాటికి నడిమంత్రపు సిరి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కాగా తెలంగాణ ప్రాంత మంత్రులు ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని ఎంపీలు అభిప్రాయపడ్డారు. మంత్రులు ఉద్యమంలో పాల్గొనేలా ఒప్పించే బాధ్యతను ఎంపీలు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డికి అప్పగించారు. మరోవైపు సచివాల తెలంగాణ ఉద్యోగులు సిఎస్‌ను కలిసి సచివాలయ ప్రాంగణంలో 144వ సెక్షన్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశాయి.












Click it and Unblock the Notifications