తిరగనివ్వొద్దు: కోమటిరెడ్డి, బిల్లుకు మద్దతు: ఎర్రబెల్లి

Komitireddy Venkat Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులను తెలంగాణలో తిరగనివ్వొద్దని మాజీ మంత్రి , కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు తెలంగాణలోని ఏ ప్రాంతానికి పర్యటనకొచ్చినా నిరసనలు తెలియజేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులను కోరారు.

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి నల్లగొండ జిల్లా ప్రజల పరువు తీశారని కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే యుపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాసం వద్ద ధర్నా చేపట్టాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కాగా సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ఆదివారం జరిగిన తెలంగాణ కవాతు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+