కిరణ్‌పై ఫిర్యాదుకు ఎంపీలు: మంత్రులనూ తేవాల్సిందే

కవాతుకు ఎవరూ రాకుండా ఉండేందుకు తెలంగాణ నుండి వచ్చే బస్సులను, రైళ్లను ఆపివేయించారని, ప్రయివేటు బస్సులను పెట్టుకుందామంటే వారిని బెదిరింపులకు గురి చేశారని, స్వంత వాహనాల పైన వస్తున్న వారిని ఎక్కడికి అక్కడ పోలీసులతో అరెస్టులు చేయించారని వారు ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు. ముఖ్యమంత్రి తీరు ఇలాగే ఉంటే తెలంగాణలో పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆయనను అదుపులో పెట్టాలను సూచించనున్నారు.
మంత్రులనూ తేవాల్సిందే
తెలంగాణ ఉద్యమంలోకి మంత్రులను తీసుకు రావాలని ఆ ప్రాంత పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నారు. దీనిపై వారు ఈ రోజు చర్చించనున్నారు. మంత్రులు ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమ వేడి మరింత పెరుగుతుందని, అప్పుడు పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై పునరాలోచిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో సొంత పార్టీపై ఒత్తిడి తేవాలంటే మంత్రులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు.
వారిని ఉద్యమంలోకి ఎలా తీసుకు రావాలి, ఎవరెవరు వస్తారు తదితర అంశాలపై ఎంపీలు చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింతోనూ ఎంపీలు భేటీ కానున్నారు. మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర ఎంపీలు భేటీకి హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications