• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రులే టార్గెట్: కోదండరామ్, అర్ధరాత్రి వరకు కవాతు

By Srinivas
|

Kodandaram
హైదరాబాద్: తీవ్ర ప్రతిఘటనల అనంతరం ప్రారంభమైన తెలంగాణ కవాతును తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం అర్ధరాత్రి వర్షం కారణంగా ముగించింది. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అక్కడే బైఠాయిస్తామని ప్రకటించిన ఐకాస భారీ వర్షం కారణంగా కొనసాగించలేక పోతున్నట్టు ప్రకటించింది. కవాతు గడువు ముగిసిన తర్వాత ఏడు గంటల నుంచే పలు దఫాలుగా వర్షం కురిసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో ఉద్యమకారులు తడిసిముద్దయిపోయారు. వేదికలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఐకాస ముఖ్యులు భేటీ అయ్యారు.

అనంతరం కవాతును విరమిస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. "విపరీతమైన వర్షం కురుస్తోంది. ఇది ఇప్పుడే పోయే నమ్మకం లేదు. వర్షం వల్ల వెళ్లేవారు వెళ్లారు. గట్టిగా నిలబడేవారు నిలబడ్డారు. దీక్షా వేదిక కూడా తడిసి ముద్దయిపోయింది. నిర్వహించే పరిస్థితి లేదు. అక్టోబర్ 2న ఇందిరా పార్కు వద్ద దీక్షా శిబిరం నిర్వహిస్తాం. త్వరలో జేఏసీ ముఖ్య నేతలు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించాం. తేదీలను జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేస్తాం. అక్టోబర్ 2న దీక్షకు అంతా రావాలి.

తెలంగాణ తెచ్చే బాధ్యత ఇక్కడి మంత్రులమీదే ఉంది. కవాతుకు పర్మిషన్ ఇప్పించినట్లే... ఢిల్లీలో కొట్లాడి తెలంగాణపై నిర్ణయం తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఇక.. ఇప్పుడు మా పోరాటం ఢిల్లీపైనో.. ప్రభుత్వంపైనో కాదు. తెలంగాణ తేవాలని ఈ ప్రాంత మంత్రులపైనే ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటం చేస్తాం. తెలంగాణ మంత్రులే రాష్ట్రం తీసుకురావాలి. వారు రాష్ట్రం తెచ్చేలా మా కార్యాచరణ ఉంటుంది. మార్చ్‌లో ఒకటి రెండు ఘటనలు మినహా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. అవి కూడా ప్రభుత్వం నుంచే జరిగాయి. పోరాటాన్ని నిరంతరం కొనసాగించేందుకు జేఏసీ సన్నద్ధంగా ఉంది. మీ సమ్మతితో తెలంగాణ మార్చ్‌ను నిలిపి వేస్తున్నాం'' అని ప్రకటించారు.

కాగా, కవాతును కొనసాగించాల్సిందేనంటూ కొందరు పట్టుబడితే జేఏసీ నేతలు జోక్యం చేసుకొని కోదండరాం చెప్పిన దానికి కట్టుబడి ఉండాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, దత్తాత్రేయ, న్యూడెమోక్రసీ నేతలు పోటు సూర్యం, గోవర్ధన్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క తదితరులు అక్కడే ఉన్నారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram said on Sunday in Telangana March that their target is now T-Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X