వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే తేల్చుకొండి: పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
న్యూఢిల్లీ: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. హైకోర్టులో తనపై ఉన్న కేసును ఎత్తివేయాలని కోరుతూ పొన్నాల లక్ష్మయ్య గతంలో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. సుప్రీం ఆయన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టులో ఉన్న కేసులు అక్కడే తేల్చుకోవాలని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సూచించింది.

కాగా 2009వ సంవత్సరంలో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. అయితే పొన్నాల గెలుపు అక్రమమని కొమ్మూరి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు రీకౌంటింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పొన్నాల సుప్రీంను ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. పొన్నాల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికలలో పొన్నాల లక్ష్మయ్యకు వచ్చిన ఓట్ల కంటే ఎనభై ఓట్లను ఎక్కువగా లెక్కించారని అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్‌లలో కూడా చెల్లని ఓట్లను ఆయనకు వచ్చినట్లుగా లెక్కించారని ఆరోపిస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ పొన్నాల మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. కానీ ఆయనకు సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.

English summary
Supreme Court has rejected IT minister Ponnala Laxmaiah's review petition on Monday. Kommuri Pratap Reddy, who was contested as TRS candidate in 2009 from Jangon has went to High Court on Ponnala's win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X