వారిని అరెస్టు చేయలేదేం: సిబిఐపై కోర్టులో మోపిదేవి

సిబిఐ ఆరోపణలకు మోపిదేవి తరఫు న్యాయవాది కౌంటర్ వేశారు. సిబిఐ ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో మిగతా నిందితులను సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మిగతా వారు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు కావా అని ప్రశ్నించారు. మిగతా నిందితులను కూడా అరెస్టు చేయాలని కోర్టుకు సూచించారు. సిబిఐ తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
శ్రీలక్ష్మి బెయిల్ విచారణ ఎల్లుండి
కర్నాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వవద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విచారణను కోర్టు 5వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications