కావేరీ: జెడి(ఎస్) ఎంపి, 4గురు ఎమ్మెల్యేలు రాజీనామా

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంటు సభ్యుడు, నలుగురు శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామికి సమర్పించారు. ఆందోళనకారులు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకోవడంతో పోలీసులు మాండ్యా జిల్లాలోని గెజ్జలగెరేలో వంద మందిని అరెస్టు చేశారు.
కావేరీ బేసిన్‌లోని మైసూరు, చామరాజ్ నగర్, మాండ్యా జిల్లాల్లో సోమవారం కూడా నిరసన పెల్లుబుకింది. బెంగళూర్, మైసూరు రోడ్డపై వరుసగా మూడో రోజు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మాండ్యా లోకసభ సభ్యుడు ఎన్ చెలువరాయస్వామి, మాండ్యా జిల్లాకు చెందిన నలుగురు శానససభ్యులు కల్పన సిద్దరాజు, సిఎస్ పుట్టరాజు, ఎం శ్రీనివాస్, ఎబి రమేష్ బండిసిద్దగౌడ తమ రాజీనామాలను కుమారస్వామికి సమర్పించారు.
భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు మంగళవారం పార్టీ శానససభ్యులు, పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కుమారస్వామి చెప్పారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.
కావేరీ జలాల విడుదల వల్ల తమ కర్ణాటక రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను వివరించాడనికి మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం కృష్ణ రాజ సాగర్, కాబిన్ డ్యామ్‌ల నుంచి ఆదివారం నుంచి 9,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఆదివారంనాడు చెప్పారు.












Click it and Unblock the Notifications