గాంధీని కాను.. మాఫియా డాన్‌ని: ఓ ఎంపి వ్యాఖ్య

Uttar Pradesh Map
న్యూఢిల్లీ: తాను జాతిపిత మహాత్మా గాంధీని కాదని, మాఫియాకు చెందిన వ్యక్తినని ఓ శాసనసభ్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మాఫియా వ్యక్తినని, తాను గాంధీగా ఎలా ఉండగల్గుతానని, తనపై నలభై కేసులు ఉన్నాయని అన్నారు. ఇతను ఈ వ్యాఖ్యలు శనివారం చేశారు. కొన్ని క్రిమినల్ కేసుల నిమిత్తం విచారణ నిమిత్తం సదరు ఎమ్మెల్యే బహ్రెయిచ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా తన పైన తన తీరును ఆయన సమర్థించుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తీర్చడం తన కర్తవ్యమన్నారు. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. తాను ఓ డాన్‌నని.. ఇంతకన్నా మంచిగా వ్యవహరించడం తనకు రాదని కుండబద్దలు కొట్టారు. తాను డాన్‌నని, తాను ఇలాగే ఉంటానని ఓ ఎమ్మెల్యే చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కాగా ఇప్పటికే కొందరు పార్టీ నేతల ప్రవర్తనతో ఇరుకున పడిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు బ్రిజ్ భూషన్ వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేట్లు కనిపిస్తోంది. గతంలో పార్టీ ఎంపి శివ్‌పాల్ యాదవ్.. గోవులను కాపాడడానికి ఒక ఉపాయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. గోవధను ఆపడానికి ఆయన.. గోవులకు బదులు లెక్కకు మించిన నీల్‌గాయ్‌లున్నాయని.. వాటిని కబాబ్‌లుగా కూడా మార్చుకుని తినవచ్చని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+