యుపిఎపై అవిశ్వాసం: మమతా బెనర్జీ ఫైర్

Mamata Banerjee
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తాము యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. యుపిఎ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెసు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఆమె యుపిఎ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫిడిఐ) అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టడానికి తాము సిద్ధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఎఫ్‌డిఐల విషయంలో యుపిఎ ప్రభుత్వం లక్ష్మణరేఖను దాటిందని వ్యాఖ్యానించారు. ఎఫ్‌డిఐల అనుమతి వల్ల ఉద్యోగాలు పోతాయని, లఘు పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆమె అన్నారు.

ఇది ధర్నా కాదని, నిరసన ర్యాలీ అని, తమ పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, పశ్చిమ బెంగాల్ నుంచి తాను ఎవరినీ తీసుకుని రాలేదని ఆమె చెప్పారు. జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

సెనెక్స్ ప్రజల ఆనందానికి సూచిక కాదని, సెనెక్స్ వల్ల సంతోషపడేవారు డబ్బు మాత్రమే కావాలని అనుకుంటున్నారని, దీదీ పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారని తృణమూల్ కాంగ్రెసు నాయకుడు కెడి సింగ్ అన్నారు.

ఆర్థిక పెరుగుదలకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఆ నిర్ణయాలు తీసుకోక తప్పలేదని ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి వి నారాయణస్వామి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+