జగన్ జైళ్లో ఉన్నా, సుప్రీమే అంతిమం కాదు: అంబటి

కోర్టులను ప్రభావితం చేస్తున్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్తామన్నారు. జగన్‌ను జైలులో ఉంచితేనే తమ బలం పెరుగుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయని విమర్శించారు. బెయిలా రాకుండా ఉండేందుకు, ఈడిని ప్రభావితం చేయడానికి టిడిపి నేతలు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారన్నారు. పార్టీని నడిపించేందుకు వైయస్ విజయమ్మ ఉన్నారని కార్యకర్తలకు, నేతలకు ధైర్యం చెప్పారు.
విజయమ్మ నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కోర్టులు, కేసులు జగన్‌ను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా ప్రస్థానంలో మాత్రం తమదే విజయమన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై తాము న్యాయనిపుణులతో మాట్లాడుతామన్నారు. సుప్రీం కోర్టు తీర్పే అంతిమం కాదన్నారు. జగన్ బెయిల్ కోసం న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుట్రలను భగ్నం చేసే వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిద్రపోదన్నారు.
బాబు ఓ నక్క
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాదు కదా.. పాకుడు యాత్ర చేసినా ప్రజల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉండదని అంబటి మండిపడ్డారు. బాబు ఎన్నటికీ మారని మనిషే అన్నారు. పులిని బోనులో పెట్టి నక్కలు మొరిగినంత మాత్రాన వాటిని ప్రజలు నమ్మరన్నారు.
చంద్రబాబు నక్క అని ఎప్పుడో రుజువైందన్నారు. జగన్‌ను జైలులో పెట్టి కిరణ్, చంద్రబాబులు యాత్రలు చేస్తున్నారన్నారు. అతను బయటకు వస్తే తమ పప్పులు ఉడకవని వారికి తెలుసునని, లోపల ఉన్నప్పటికీ ప్రజలు బాబు, కిరణ్‌లను నమ్మరన్నారు. జగన్‌ను జైలులో పెట్టి పాదయాత్ర చేస్తే బలం పెరుగుతుందని బాబు భావిస్తే అది అమాయకత్వమే అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications