జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలోకి చొచ్చుకొచ్చిన యువకులు

ఉద్యోగాలు కల్పించని ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే పటిష్టమైన భద్రతా వలయాన్ని చేధించుకొని ముగ్గురు యువకులు అసెంబ్లీ లోపలకు రావడంతో మార్షల్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
వారిని వెంటనే బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది భద్రతా వైఫల్యం కాదని, సభలోకి వచ్చిన ముగ్గురి వద్ద పాసులు ఉన్నాయని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తెలియజేశారు. కాగా వారు జమ్మూకు చెందిన యువకులను తెలిస్తోంది.
మరోవైపు యువకులకు పాసులు అందటంపై స్పీకర్ దర్యాఫ్తునకు ఆదేశించారు. ఈ అంశాన్ని ఓమర్ అంత సీరియస్‌గా తీసుకోక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉన్నదని, వారు నిరాయుధులని, వెంటనే విడిచి పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications