కోర్టుకు హాజరుకాలేను: ధర్మాన, హాజరైన విజయసాయి

మంత్రి అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించింది. జగన్ ఆస్తుల కేసులోనే సిబిఐ కోర్టు ఎదుట విజయ సాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్, చంద్రమౌళి, విజయలక్ష్మి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. క్విడ్ ప్రో కేసుల్లో చంచల్‌గూడ జైలులో ఉన్న వారిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తుంది.
ఎమ్మార్ కేసులో..
ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్, శ్రవణ్ గుప్తా, విజయ రాఘవలు సిబిఐ కోర్టులో హాజరయ్యారు.
ఓఎంసి కేసులో...
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్‌ను సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం తమ కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న అలీని ఉదయం అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తరలించారు. నేటి నుండి 16వ తారీఖు వరకు అలీని న్యాయస్థానం సిబిఐ కస్టడీకి అప్పగించింది.












Click it and Unblock the Notifications