వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్‌మనీతో ఆస్తులు: వాద్రాపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal-Robert Vadra
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించి అవినీతి ఆస్తుల పైన కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించిన ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని వివరాలు సేకరించి మంగళవారం సాయంత్రం మీడియాకు ముందుంచారు. వాద్రా ఆస్తుల పైన తాను మరిన్ని ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. బ్లాక్ మనీ ఆధారంగా ఆయన ఆస్తులు పెరిగాయని ఆరోపించారు.

రాబర్ట్ బ్యాలెన్స్ షీట్‌లో బ్యాంక్ డిపాజిట్లు వివరాలు ఏమీ లేవని చెప్పారు. డిఎల్ఎఫ్‌తో రాబర్ట్ కుమ్మక్కయ్యారని, వాద్రా కోసం హర్యానా ప్రభుత్వం కూడా డిఎల్ఎఫ్‌తో కుమ్మక్కైందన్నారు. డిఎల్ఎఫ్ వాద్రాకు రూ.60 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆసుపత్రికి ఇవ్వాల్సిన 350 ఎకరాల భూమిని హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్‌కు ఇచ్చిందని, ఇది కుమ్మక్కులో భాగంగానే జరిగిందన్నారు.

వాద్రా ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. కుమ్మక్కు విషయాన్ని హర్యానా కోర్టు కూడా ధృవీకరించిందని తెలిపారు. డిఎల్ఎఫ్ హోర్డింగ్స్‌లో వాద్రాకు యాభై శాతం వాటాలు ఉన్నాయన్నారు. వాద్రా ఆస్తులకు సంబంధించి తనకు చాలామంది వివరాలు పంపించారని తెలిపారు. హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్‌కు ఏజెంట్‌గా పని చేసిందని విమర్శించారు. డిఎల్ఎఫ్‌కు భూముల కేటాయింపులలో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

డిఎల్ఎఫ్ సెజ్‌లో వాద్రాకు యాభై శాతం వాటాలు అందాయని, వాటిని అతను సంవత్సరంలో తిరిగి విక్రయించారని ఆరోపించారు. డిఎల్ఎఫ్ ఎలాంటి హామీ లేకుండా రూ.60 కోట్ల రుణాన్ని వాద్రాకు ఇచ్చిందన్నారు. డిఎల్ఎఫ్‌కు కేటాయించిన భూములను హైకోర్టు రద్దు చేసిందని, భూ కేటాయింపులపై హర్యానా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

English summary
Arvind Kejriwal alleged that Robert Vadra, who is son in law of AICC president Sonia Gandhi was a big corruptionist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X