వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చాక్లెట్ పెడితే మూడేళ్ల చిన్నారి చేయిని తినేసిన పులి

ఈ సమయంలో నిఖిల్ తన వెంట తెచ్చుకున్న వేరుశనగకాయలను జింకలకు పెట్టాడు. మిగతా వారంతా జింకల దగ్గర ఉండగా ఇతడు మాత్రం పక్కనే ఉన్న పులి బోను వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన నిఖిల్ తన వద్ద ఉన్న చాక్లెట్‌ను పులి నోట్లో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ పులి క్షణాల్లో చిన్నారి ఎడమ చెయ్యిని నోట కరుచుకుంది. ఒక్కసారిగా బోనులోకి చెయ్యిని లాక్కొని తినేసింది. దీంతో బాలుడు ఆర్తనాదాలు పెట్టాడు.
ఇది విన్న అతని అమ్మమ్మ అక్కడకు వచ్చేలోపు దారుణం జరిగింది. వెంటనే జూ సిబ్బంది, సందర్శకులు అక్కడకు వచ్చి బాలుడిని రక్షించారు. నిఖిల్‌ను వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిఖిల్ రామనగర్ జిల్లా చెన్నపట్టణ గ్రామానికి చెందిన నాగబాబు, లక్ష్మీల తనయుడు.