షర్మిల పాదయాత్రకు యాగం, చారిత్రాత్మకం: సురేఖ

షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ 25 మంది వేద పండితులు మన్యుపాశుపత రుద్రయాగం చేశారు. భగవంతుని సహకారంతో షర్మిల మరో ప్రస్థానం నిరాటంకంగా కొనసాగుతుందని వేద పండితులు విశ్వాసం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర రోడ్ మ్యాప్‌ను ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకమవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కును, కుట్రలను బట్టబయలు చేస్తూ ప్రజాసమస్యలపై పోరాడేందుకు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారని ఆమె శనివారం వరంగల్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని సురేఖ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పాదయాత్ర కొంగ జపాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్రపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications