జగన్ ఒక్కడే చేస్తాడు: సంకినేని, విజయమ్మతో జలగం

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టించారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని నిప్పులు చెరిగారు. బాబు అవకాశవాద రాజకీయాలు నచ్చకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.
తాను నవంబర్ 11న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో సూర్యాపేటలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, సీనియర్ రాజకీయనేత జలగం వెంకట్రావు కూడా విజయమ్మను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను నవంబర్ 19వ తేదిన ఖమ్మంలో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications