విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెహ్రూ విగ్రహానికి మద్యం సీసా: పక్కనే వైయస్ విగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jawaharlal Nehru
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం అర్ధరాత్రి దివంగత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి అవమానం జరిగింది. గుడివాడలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి ఎవరో ఆకతాయిలు మద్యం సీసాను తగిలించారు. చాచి ఉన్న నెహ్రూ విగ్రహానికి ఈ సీసాను అమర్చారు. దీనిని అర్ధరాత్రి సమయంలో అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఆదివారం ఉదయం పది గంటల వరకు దీనిని ఎవరూ చూడలేదు. ఆ తర్వాత స్థానికులు దీనిని గమనించి, పోలీసులకు సమాచారమందించారు. పరిస్థితి అదుపు తప్పకూడదన్న ఉద్దేశ్యంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నెహ్రూ విగ్రహానికి ఉన్న మద్యం సీసాను తొలగించారు.

ఈ విగ్రహానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. దీంతో తాగిన వారు ఎవరో మద్యం మైకంలో నెహ్రూ విగ్రహానికి దీనిని తగిలించి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఇలా చేశారో తెలుసుకుంటామని వారు చెప్పారు. నెహ్రూ విగ్రహానికి మద్యం సీసాను తగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. దానికి ఏమీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెహ్రూ విగ్రహంపై ఇలా దుశ్చర్యకు దిగడంతో అందరూ దానిని ఖండిస్తున్నారు.

English summary
Unknown people attached a liquor battle to late prime minister Jawaharlal Nehru at Gudiwada in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X