వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాద్రా డీల్‌పై విచారణకు ఆదేశించిన ఐఎఎస్ బదిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Robert Vadra
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, డిఎల్ఎఫ్ మధ్య జరిగిన ల్యాండ్ డీల్‌పై విచారణకు ఆదేశించినందుకు గాను హర్యానా ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డిఎల్‌ఎఫ్‌కు 3.53 ఎకరాల భూమి బదలాయింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన భూముల రిజిస్ట్రేషన్ శాఖ అధికారి అశోక్ ఖేమ్కాని ప్రభుత్వం బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూమి కుంభకోణాలపై ఖేమ్కా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని, తనకూ తన కుటుంబానికీ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఖేమ్కాను బదిలీ చేయడంపై హర్యానా ప్రభుత్వం మీద ఇండియా అగనెస్ట్ కరప్షన్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వాద్రా డిఎల్ఎఫ్‌కు విక్రయించిన భూమి మ్యుటేషన్‌ను ఖేమ్కా రద్దు చేసి విచారణకు ఆదేశించారు. తాను అక్టోబర్ 8వ తేదీన విచారణకు ఆదేశించానని, తనకు అక్టోబర్ 11వ తేదీన బదిలీ ఆదేశాలు వచ్చాయని ఖేమ్కా ఓ మీడియా సంస్థతో చెప్పారు. బదిలీ గల కారణంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

తనపై 20 ఏళ్లలో 40 బదిలీ వేట్లు పడ్డాయని చెప్పారు. తన బదిలీలకు కారణమేమిటో చెప్తే తాను మంచి సివిల్ సర్వెంట్‌గా మారడానికి తనను తాను మార్చుకుంటానని అన్నారు. ఖేమ్కాను శిక్ష కింద బదిలీ చేయలేదని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా అన్నారు. ప్రకటనలు అబద్ధమైతే ఖేమ్కాపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం ఎవరికీ పక్షపాత వైఖరితో మేళ్లు చేయలేదని స్పష్టం చేశారు.

English summary
A senior IAS officer in the land registration department of the Haryana government was transferred for reportedly scrapping a land deal between Robert Vadra, son-in-law of Congress chief Sonia Gandhi and realty giant DLF. The officer, Ashok Khemka, had annulled the mutation effecting the sale of 3.53 acres of land after he found irregularities in the transfer of the land from Vadra's Sky Light Hospitality Private Limited to DLF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X