హైదరాబాదులో ఉండలేకపోయా, కాళ్ల నొప్పులు: బాబు

Chandrababu Naidu
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర బుధవారం పదహారో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో ఇవ్వాల నాలుగోరోజు. చంద్రబాబు ఆదోని నియోజకవర్గంలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు చూశాక తనకు హైదరాబాదులో ఉండాలనిపించలేదని, అందుకే పాదయాత్రతో సమస్యలు తెలుసుకునేందుకు సిదపడ్డానని చెప్పారు.

ఇప్పటి వరకు తాను 324 కిలోమీటర్లు తిరిగానని, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వచ్చాను తప్ప, అధికారం కోసం రాలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో రాష్ట్రం చీకటిమయమైందని ఆరోపించారు. చాలామంది ఉపాధి కోల్పోయారన్నారు. కరెంట్ కోత కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయ దిగుబడులు తగ్గాయన్నారు. తనకు కాళ్లు నొప్పులు పుడుతున్నా, బొబ్బలెక్కినా ప్రజల కోసం ఏం చేసేందుకేనా సిద్ధంగా ఉన్నానన్నారు.

పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టిందే అవినీతి నుండి అన్నారు. అవినీతికి లైసెన్స్ కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెసును తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు తన వస్తున్నా మీకోసం పాదయాత్రను 16వ రోజు కర్నూలు జిల్లా ఘణపురం నుండి ప్రారంభించారు. ఈ రోజు ఆయన ఆదోని నియోజకవర్గంలో 19.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+