తప్పే: తెలంగాణ జర్నలిస్ట్స్‌కు బొత్స అండ, ర్యాలీ ఉద్రిక్తం

మీడియా విషయంలో బ్లాక్ లిస్ట్, వైట్ లిస్ట్ అంటూ ఉండదన్నారు. సిఎం ఢిల్లీ టూర్లో పాలనాపరమైన అంశాలే ఉంటాయన్నారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర ప్రాధాన్యత పెరగాల్సి ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లాకు ఓ చైర్మన్ పదవి, నియోజకవర్గానికి ఓ డైరెక్టర్ పదవి ఉండాలనేది తమ అభిప్రాయం అన్నారు.
టి జర్నలిస్టుల ర్యాలీ ఉద్రిక్తం
మంగళవారం ప్రదాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా టి జర్నలిస్టులు బుధవారం గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు ర్యాలీగా డిజిపి కార్యాలయానికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎందుకు అనుమతించలేదో అడిగేందుకే వెళ్తున్నామనని జర్నలిస్టులు చెప్పారు. పోలీసులు, జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు అడ్డుకోవడంతో జర్నలిస్టులు రవీంధ్ర భారతి, అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. డిజిపి కార్యాలయం ముందు మహిళా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన తెలంగాణ జర్నలిస్టులను నారాయణగూడ, సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లకు తరలించారు. జర్నలిస్టుల అరెస్టును తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు ఖండించారు. జర్నలిస్టుల ర్యాలీతో అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
మెస్ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలనే డిమాండుతో తెరాస ఎమ్మెల్యేలు హైదరాబాదులోని సంక్షేమ భవనం వద్ద ధర్నాకు దికారు. అంతకుముందు వారు అధికార్లను కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారుల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. పోలీసులు అరెస్టు చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications