వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు అమ్మాయిలు సహా గీతం స్టూడెంట్స్ గల్లంతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: జిల్లాలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన సంఘటన విషాదాన్ని నింపింది. విశాఖ జిల్లా గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు విద్యార్థులు రిషికొండ బీచ్‌కు బుధవారం మధ్యాహ్నం ఈత కోసం వెళ్లారు. వారు ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో వారు గల్లంతయ్యారు. దీనిని గమనించిన మత్సకారులు, గజ ఈతగాళ్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వారు రాహుల్ బాబు అనే విద్యార్థిని రక్షించారు. మరో ఆరుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో భూపతి సుశీల్, ప్రీతి రెడ్డి, సింధూజ, సాయి నితిన్‌, అనురాగ్ రెడ్డితో పాటు మరొకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు అని తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. సాయి ప్రియా రిసార్ట్ సమీపంలో వారు గల్లంతయ్యారు.

గల్లంతైన విద్యార్థులు అందరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అందరూ మొదటి సంవత్సరం విద్యార్థులే కావడం విషాదకరం. వీరి కోసం నావికాదళం రంగంలోకి దిగింది. మెరైన్ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సింధు హైదరాబాద్, అనుష నల్గొండ, సాయి నితిన్ హైదరాబాద్, సుశీల్ వరంగల్, అనురాగ్ కరీంనగర్, ప్రీతి కరీంనగర్‌లకు చెందిన వారిగా గుర్తించారు.

గోడ కూలి ముగ్గురి మృతి

చెర్లపల్లి పారిశ్రామికవాడలో శ్రీసాయికృష్ణ ఇండస్ట్రీలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ పరిశ్రమలో బ్లోయర్స్ తయారు చేస్తుంటారు. స్లాబ్ వేసేందుకు గోడ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన వారు ఉన్నారు.

English summary
Six Geetham students missed at Rishi Vally beach on Wednesday. Fishermen saved one student and searching for other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X