వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్తూ వెళ్తూ రాబర్ట్ వాద్రాకు ఝలక్ ఇచ్చిన ఐఏఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Robert Vadra
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, డిఎల్ఎఫ్ మధ్య జరిగిన ల్యాండ్ డీల్ పైన విచారణకు ఆదేశించినందుకు గాను హర్యానా ఏఐఎస్ అధికారి అశోక్ ఖేమ్కా పైన వేటు వేసిన విషయం తెలిసిందే. అతనిని అప్రాధాన్యత పోస్టుకు బదలీ చేసింది ప్రభుత్వం.

అయితే వెళ్తూ వెళ్తూ అధికారి ఖేమ్కా వాద్రాకు, డిఎల్ఎఫ్‌కు, వారిని వెనుకేసుకొస్తున్న శక్తులకు గట్టి ఝలక్ ఇచ్చి వెళ్లారు. డిఎల్‌ఎఫ్‌కు వాద్రా సంస్థ చేసిన భూ విక్రయాన్ని ఆయన రద్దు చేశారు. ఇది రూ.58 కోట్ల డీల్ అని తెలుస్తోంది. ఖేల్కా ఈ నెల 15వ తేదిన రద్దు చేశారు. రూ.58 కోట్ల విలువైన 3.5 ఎకరాల డీల్‌ను రద్దు చేశారు.

కాగా రాబర్ట్ వాద్రా, డిఎల్ఎఫ్ మధ్య జరిగిన ల్యాండ్ డీల్‌పై విచారణకు ఆదేశించినందుకు గాను హర్యానా ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డిఎల్‌ఎఫ్‌కు 3.5 ఎకరాల భూమి బదలాయింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన భూముల రిజిస్ట్రేషన్ శాఖ అధికారి అశోక్ ఖేమ్కాని ప్రభుత్వం బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూమి కుంభకోణాలపై ఖేమ్కా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని, తనకూ తన కుటుంబానికీ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఖేమ్కాను బదిలీ చేయడంపై హర్యానా ప్రభుత్వం మీద ఇండియా అగనెస్ట్ కరప్షన్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తనపై 19 ఏళ్లలో 43 బదిలీ వేట్లు పడ్డాయని ఖేమ్కా చెప్పారు. తన బదిలీలకు కారణమేమిటో చెప్తే తాను మంచి సివిల్ సర్వెంట్‌గా మారడానికి తనను తాను మార్చుకుంటానని అన్నారు. తాను అక్టోబర్ 8వ తేదీన విచారణకు ఆదేశించానని, తనకు అక్టోబర్ 11వ తేదీన బదిలీ ఆదేశాలు వచ్చాయని ఖేమ్కా చెప్పారు.

English summary
Ashok Khemka, a senior bureaucrat in Haryana, was transferred three days after he ordered an inquiry into all land deals within the state between businessman Robert Vadra and realty giant DLF. Yesterday, Mr Khemka cancelled DLF's purchase of 3.5 acres from Mr Vadra for 58 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X